సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్ధతుగా జనసేన అన్నదానం

తిరుపతి, టీటీడీ యాజమాన్యం, అధికారులు కార్మికుల విన్నపాలు నెరవేర్చాలని, వెంటనే వాళ్ళ జీతాలు పెంచి మరియు ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్సులు ఇవ్వాలని, సులభ్ కార్మికులను పర్మినెంట్ చేసి వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వాలని, నాలుగు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం సులభ్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో పార్టీ పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం టీటీడీ సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ టీటీడీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేశారని డా.పసుపులేటి హరిప్రసాద్ కార్మికులకు తెలియజేశారు. కార్మికుల సమస్యలపై టీటీడీ అధికారులు స్పందించి వీరి డిమాండ్లకు సమ్మతించే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ఈ డిమాండ్లను సమ్మతించని పక్షంలో సమ్మె తీవ్రరూపం దాల్చుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు పి.ఆనంద్, బాటసారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.