రాజోలు వీరమహిళలచే ₹21000 ఆర్ధిక సాయం

రాజోలు, ఇటీవల కాలంలో ప్రమాదానికిగురై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తాటిపాక గ్రామానికి చెందిన కాలం నారాయణ(47) కు ఆపరేషన్ నిమిత్తం రూపాయలు 21000/- జనసేన వీరమహిళలు ఆర్థిక సాయం చేసారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ స్పూర్తితో రాజోలు జనసేన పార్టీ వీర మహిళల ఆద్వర్యంలో తాటిపాక గ్రామ సర్పంచ్ కోటిపల్లి రత్నమాల, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజి, రాజోలు జనసేనపార్టీ మండల అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాసరావు, ఉలిశెట్టి అన్నపూర్ణ, ఎంపీటీసి జక్కంపూడి శ్రీనివాస్ శ్రీదేవి, జనసేన యూత్ గర్ల్స్, నల్లా జ్యోతి, జనసేన నేత యెరుబండి చిన్ని చేతుల మీదుగా రూ.21000 ను నారాయణకు అందచేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కటికిరెడ్డి బుజ్జి, పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, పాటబళ్ళ మురళీ, సుదా మోహన్ రంగా, మద్దుల తేజా, మండేల శ్రీను, యెరుబండి చిన్నబుజ్జి, జనసేన పార్టీ వీర మహిళలు పేనుమాల లక్ష్మి, శాంతి, హేమ, అంజన, యమున, గంగ మరియు నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.