వనదుర్గాపురంలో జనం కోసం జనసేన

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలం, దిగువ వనదుర్గాపురం గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను కరపత్రాల రూపంలో ఇంటింటికి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న మరియు మండల కమిటీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.