జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్ సేవలు

రాజోలు, తాటిపాక సోమిశెట్టి ల్యాండ్‌మార్క్ అధినేత సోమిశెట్టి ఆంజనేయులు పుట్టినరోజు, అదేవిధంగా సోమిశెట్టి ఆంజనేయులు, శ్రీమతి నాగలక్ష్మి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా.. వారు అందించిన ధనసహాయంతో ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతం ఏర్పాటుచేసి జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా సఖీనేటిపల్లి స్టీమర్ రేవు ప్రాంత ప్రజలకు మంగళవారం త్రాగునీరు అందించబడింది. ఈ కార్యక్రమాన్ని సఖినేటిపల్లి నీటి సంఘం అధ్యక్షుడు నామన నాగభూషణం తెలిపారు.

Share this content:

Post Comment