పల్లె పల్లె లో జనసేన

ఆంధ్ర, తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో బలోపేతం కావడమే జనసెన మొదటి తక్షణ కర్తవ్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటానికి గ్రామీణ ప్రాంత ఓటర్లు పార్టీకి శ్రీరామరక్ష.

పల్లెల్లో ప్రభంజనం సృష్టించిన జనసేన. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుదారులు అనూహ్యమైన విజయం సాధించి అందరిని ఆశ్చర్యపరిచారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ మద్దతుదారులు బలమైన అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులను ఓడించి గెలిచారు.

జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతుందని చెప్పడానికి పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడమే నిదర్శనంగా చూపించవచ్చు.ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకారం.. పల్లెల్లో యువత ఎక్కువగా పవన్ కళ్యాణ్కి ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రమేయం లేకుండానే ఆయన సొంత జిల్లా రాజోల్ లో 10 మంది జనసేన మద్దతుదారులు గెలిచి తమ సత్తా ఏంటో నిరూపించారు. పల్లె పోరులో జనసైనికులు సాధించిన విజయాలను చూసి పవన్ సంతోష పడుతున్నారు. కానీ ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు పార్టీని బలోపేతం చేయాలనీ తీవ్ర కృషి చేస్తున్నారు.. పార్టీ నాయకుడిగా మందు నుండి అన్ని చూసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఎంతగానో ఉంది కాబట్టి జనసైనికులను ఉత్తేజపరుస్తూ ప్రసంగాలు ఇస్తూ పల్లె పల్లె కి జనసేన వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

జనసేన పార్టీ విధివిధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే బలమైన కాంక్షతో శ జనసేన పార్టీ కార్యకర్తలు తలపెట్టిన “పల్లె పల్లెకు జనసేన” కార్యక్రమం నేడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్లప్రారంభమైంది. పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం చాలా చోట్లప్రారంభించిన జనసేన నాయకుల ఎంతో పట్టుదలతో కార్యక్రమాన్ని జనసైనికులు ముందుకు తీసుకెళ్తున్నారు.

నేటి సమాజంలో సమకాలీన రాజకీయ పరిస్థితులను గమనిస్తే ప్రతి ఒక్కరికీ స్పష్టంగా అర్థమయ్యే అంశం ఇప్పుడున్న ప్రధాన పార్టీల ముఖ్య అజెండా అధికారం సాధించడమే. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం అధినేతలు కేవలం ముఖ్యమంత్రి కుర్చీ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్పించి ఏనాడూ పల్లె బాట పట్టి ప్రజా సమస్యల అధ్యయనం, పరిష్కారం దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యం అని తెలిసిందే. అధికారంలో ఉంటూ స్వలాభాలను చూసుకోవడం, బంధుప్రీతి, అయిన వారికి మరియు అనర్హులకు మంత్రి పదవులు మరియు ఉన్నత పదవుల కల్పన వంటివే మనం చాన్నాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయ రాజకీయాలకు, అజెండాలకు భిన్నంగా తనకు అధికారం ముఖ్యం కాదని స్పష్టం చేస్తూ పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అంటూ నూతన రాజకీయ ఒరవడికి జనసేన పార్టీ ద్వారా జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారన్నారు. మూడున్నరేళ్ళ క్రితం పార్టీ ప్రారంభం సందర్భంగా చేసిన ప్రసంగానికి అనుగుణంగా, తదుపరి ఎన్నికల క్షేత్రంలో మిత్ర పక్షాలతో కలిసి చేసిన వాగ్ధానాలకు అనుగుణంగా ఇచ్చిన మాటను తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రశ్నలను సందిస్తూ ప్రజా సమస్యలను పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తున్నారు.

పల్లెల్లో పట్టు ఉందని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడంతో స్థానిక ఎన్నికల ఫలితాలు జనసేనలో కొత్త జోష్ తీసుకొచ్చాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ ఉన్నప్పటికీ పంచాయితీల్లో జనసేన రెండో స్థానంలో నిలిచిందంటే తమకు పల్లెల్లో ఓటు బ్యాంకు ఉందనేది గుర్తించాలన్నది వారి మాట. ఒకే ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో బలం పుంజుకున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో 1700 పంచాయతీల్లో, రెండో దశలో 1500 పంచాయితీల్లో, మూడో దశలో 1654 పంచాయితీల్లో రెండో స్థానంలో తమ పార్టీ అభ్యర్థులు నిలిచారని లెక్క కడుతున్నారు నేతలు. ఇక జిల్లా వారీగా చూస్తే ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన ప్రభావం చూపగలిగింది.

ఇక మరోసారి రాజోలు ప్రజలు జనసేనకు మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో జనసేనను గెలిపించిన స్థానికులు…

పంచాయతీ ఎన్నికల్లోనూ 10 స్థానాలు కట్ట బెట్టారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు పలికినా…

జనం మాత్రం జనసేనకే జై కొట్టారు. 10కి పైగా గ్రామాల్లో జనసేన మద్దతుదారులు విజయఢంకా మోగించారు. పల్లెటూరు దేశానికి పట్టు కొమ్మలు అలాగే పల్లె యువత జనసేన కి కొండంత అండ.