బొమ్మి ఇజ్రాయిల్ పై జనసేన నేతల ధ్వజం

అమలాపురం, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్ మరియు సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు ఆధ్వర్యంలో అమలాపురం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బొమ్మి ఇజ్రాయిల్ పై జనసేన నేతలు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా గండి స్వామి మాట్లాడుతూ.. బొమ్మి ఇజ్రాయిల్ అనాధ పిల్లల పెళ్లి చేస్తామన్న పేరుతో… డబ్బులు దోచుకున్నారని, ఎమ్మెల్సీ అయ్యాక పోలీస్ జాబులు ఇప్పిస్తామని ఈ రాష్ట్రంలోని యువతీ–యువకుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసారని, రోళ్లపాలెం ల్యాండ్ సెటిల్మెంట్‌లో వారి సొంత సామాజికవర్గానికి చెందిన వారినే పీడించి డబ్బులు వసూలు చేసారని, వై జంక్షన్ దగ్గర ఏడు సెంట్ల భూమిని భయపెట్టి, కేవలం 18 లక్షలకే లాక్కున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడి వర్గీకరణ చేస్తే పార్టీ మారతా అని, పాయకరావుపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారిని పిలిచి సంప్రదింపులు జరిపి ఎంత దోచుకున్నాన్నారని, 2022 డిసెంబర్ 11న వనభోజనాలు పెట్టిన నువ్వు… 2023 డిసెంబర్ 11న మళ్లీ పెట్టి… బ్యానర్లలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ ఫోటో పెట్టవద్దని హుకుం జారీ చేసారని, 2024 డిసెంబరులో వనభోజనాలు పెట్టకపోవడానికి… నీ సొంత సామాజికవర్గం నుంచే వ్యతిరేకత రాలేదా..? లేక ఎమ్మెల్సీ కుర్చీ వచ్చాక మర్చిపోయావా…? మాదిగ జాతి గౌరవం కోసం ప్రాణం పెట్టి పోరాడుతున్న… మందకృష్ణ మాదిగని “మాఫియా” అని పిలిచే నీచత్వం చూపించావు. నీ దోపిడీలు, నీ ద్రోహాలు… లెక్కేస్తే జాబితా అంతులేదు. అలాంటి నువ్వు… పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత ఎక్కడిది? ప్రజలు మేలు చేస్తారని నమ్మి నీకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించకపోతే… నువ్వు మోసగాడివే! మరొక్కసారి పవన్ కళ్యాణ్ గురించి అవమానకరంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లింపజేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గండి దేవి హారిక స్వామి, ఎంపీటీసీ తాళ్ల నరసాయమ్మ, పిండి గణపతి, తాళ్ల రవి, దూలం వరలక్ష్మి, గనిశెట్టి లలిత, నాగులపల్లి రాజు, మేకల దొరబాబు, గుమ్మల తాతకాపు, నవ్వుండ్రు జానీ, సత్తి శ్రీనివాస్, గుండుమోగుల బాలరాజు, దందర్తి ప్రసాద్, నేదునూరి నాని, చాట్ల దుర్గారావు, తత్తరముడి దుర్గ, ఉత్తరముడ, శేఖర్, నేదునూరి నవీన్, చాట్ల దుర్గారావు, చాట్ల ప్రసాద్, జనపిల్ల ప్రవీణ్ మరియు జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment