సముద్రాన్ని తలపిస్తున్న జగనన్న ఇళ్ల స్థలాలు – ప్రభుత్వాన్ని నిలదీసిన బత్తుల

  • ఇళ్లస్థలాల పేరిట వైసీపీ చేస్తున్న మోసాలపై జనసేన పోరుబాట
  • పేదల ఇళ్ల స్థలాల కొనుగోలులో వందల కోట్ల అవినీతి చేసిన వైసిపి నేతలు
  • రైతుల దగ్గర పొలాలు తక్కువ రేట్ లోని.. ప్రభుత్వ ఖజానా నుండి ఎక్కువ మొత్తంలో దోచేసిన వైసిపి నేతలు
  • మీడియా సాక్షిగా.. వైసీపీ పేదల ఇళ్ల స్థలాల పేరిట వైసిపి చేస్తున్న మోసాలను వివరించిన “బత్తుల”
  • ఇళ్ల స్థలాల కొనుగోలులో వందల కోట్లు అవినీతిమయం

రాజనగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, బూరుగుపూడి కోరుకొండ గ్రామాల మధ్యనున్న ఆవు భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన ఆవు భూమిని గురువారం రాజనగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ భక్తుల బలరామకృష్ణ సందర్శించి, అక్కడ జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరించారు. జగనన్న ఇల్లు పేరిట పేదల కోసం బూరుగుపూడి గ్రామం వద్ద కేటాయించిన 596 ఎకరాల ఆవు భూమిని సందర్శించే నిరసన తెలియజేస్తూ అక్కడికి విచ్చేసిన మీడియాతో మాట్లాడుతూ.. చిన్నపాటి వర్షానికి సముద్రాన్ని తలపించే విధంగా ఉండే ఆవు భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఎలా కేటాయిస్తారని, ఇక్కడ సంవత్సర కాలంలో ఆరు నెలలు పూర్తిగా 15 అడుగులు నీరు నిల్వ ఉంటుందని, ఈ భూమి సేకరణ కోసం రైతుల దగ్గర నుంచి అతి తక్కువ మొత్తంలో ధర చెల్లించి ప్రభుత్వ ఖజానా నుండి వందల కోట్లు దండుకుని స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఇతర వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అవినీతి చేసిన ఆరోపణలు మీడియాకు వివరించారు. ఇలాంటి నిరుపయోగమైన ఇళ్ల స్థలాలు పేదలకు ఎలా కేటాయిస్తారని, ఇది ఇళ్ల స్థలాల పేరిట ప్రజలను మోసం చేయడం కాదని వివరిస్తూ కేవలం వైసీపీ నేతలు బాగు కోసమే ఇలాంటి దుర్మార్గమైన వైసిపి నేతలు చేస్తున్నారని దీన్ని ప్రజల్లోకి మరింత ఉధృతంగా తీసుకెళ్లే వైసిపి చేసిన ఆగడాలను అరాచకాలను అవినీతిని ప్రజలకు వివరిస్తామని అలానే మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దృష్టి కూడా ఈ వందల కోట్ల అవినీతి మరియు ఈ నిరుపయోగమైన భూమి వివరాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే న్యాయపోరాటం మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం, మండల కన్వీనర్లు మండపాక శ్రీను, బత్తిన వెంకన్న దొర, కార్చర్ల కారిశెట్టి విజయ శంకర్, సర్పంచులు కిమిడి శ్రీరాం, గళ్ళ రంగా, గుళింకల లోవరాజు, సీనియర్ నేతలు అడ్డాల శ్రీను, మట్ట వెంకటేశ్వరరావు, మద్ది రెడ్డి బాబులు, నాతిపం దొరబాబు, అరిగెల రామకృష్ణ, కొత్తపల్లి రఘు, పాలచర్ల రాజారావు, ఎర్రం శెట్టి శ్రీను, గంగిశెట్టి రాజేంద్ర, కర్రీ దొరబాబు, మొక్క రాంబాబు, తన్నీరు తాతాజీ, దేవన దుర్గాప్రసాద్, నల్ల దుర్గాప్రసాద్, వెంకన్న బాబు, మిరియాల సాయి, చిట్టిప్రోలు సత్తిబాబు, కోటి ముక్తేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి మండపాక శ్రీను, సంగుల రమేష్, వేగిశెట్టి రాజు , దేనెడి మణికంఠ స్వామి (డిఎంఎస్), తోట అనిల్ వాస్, వీరమహిళలు గండి జయసుధ, కంచికట్ల అరుణ్ కుమార్, పొట్నూరి అప్పన్న, పొట్నూరి అచ్చియమ్మ, మరియు ఇతర నేతలు, జనసైనికులు పాల్గొన్నారు.