జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కు ఘన సన్మానం

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్నం నందు శ్రీ సూర్య రాయ విద్యానంద గ్రంథాలయం నందు పురుహూతిక లలిత కళాపరిషత్ వారిచే ఏర్పాటు చేయబడినటువంటి ఉగాది కవి సమ్మేళనము మరియు ఉగాది విశిష్ట సేవ పురస్కార కార్యక్రమానికి కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాలుపంచుకున్నటువంటి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత మరియు డాక్టర్ పిల్లా శ్రీధర్ ని వారి యొక్క సేవా దృక్పథానికి గాను వారు చేసిన సేవలు, పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా ప్రాంతం ఏదైనా సేవే మార్గంగా ముందుకు వెళుతున్న సేవను గుర్తించి ఎంపిక చేసి ఘనంగా సన్మానించడం జరిగింది.