సీతానగరంలో రోడ్ల దుస్థితి పై జనసేన నాయకుల నిరసన

పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండల కేంద్రంలో రోడ్ల దుస్థితి దయనీయంగా ఉన్నాయని స్థానిక జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లు రమేష్ మాట్లాడుతూ గ్రామస్వరాజ్యం అంటే ప్రజలకి మౌలిక వసతులు కలిపించాలి. కానీ ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎంత దారుణాతిదారుణంగా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు గాని కళ్లకు కనపడనట్టుగా చూస్తున్నారు తప్ప.. బాగుచేయాలి అనే ఆలోచన లేన్నట్టు కనపడుతుంది. కేంద్రప్రభుత్వం రోడ్ల నిర్మాణంకి ఇచ్చిన నిధులేమైనట్టు?. వేసిన రోడ్స్ లెక్క చూపాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పులు చేసి నవరత్నాల పేరుతో పంచేపద్ధతి తో ఓటుబ్యాంకింగ్ మీద ఉన్న శ్రద్ద మౌలిక వనరుల మీద లేదని విమర్శించారు. తప్పుడు లెక్కలు చూపటం, ప్రజలని భయపెట్టటం, అక్రమ కేసులు పెట్టడం తప్ప అభివృద్దే సూన్యం అని చురకలంటించారు. గాంధీ వాదాన్ని అలవర్చుకున్న నిజమైన గ్రామస్వరాజ్యం జనసేనానితో సాధ్యం అని రాబోయే రోజుల్లో నెరవేరి తీరుతుంది అని హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్తమంలో జనసేన నాయకులు అల్లు రమేష్, సంతోష్, వాసు, శంకర్, జైశంకర్, వెంకటరమణ, జై ప్రకాష్, భాస్కర్, వీరమహిళ నాగమణి మరియు జనసైనికులు పాల్గొన్నారు.