కండ్రిగ గ్రామంలో జగనన్న కాలనీల సందర్శన

సత్యవేడు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు #ఫెయిల్యూర్ అఫ్ జగనన్న కాలనీ కార్యక్రమంలో భాగంగా శనివారం సత్యవేడు నియోజకవర్గం, నారాయణవనం మండలం, చిత్తూరు కండ్రిగ గ్రామంలో జగనన్న కాలనీ సందర్శించడం జరిగింది. జిల్లా కార్యదర్శులు కొప్పుల లావణ్య కుమార్, దాసు హేమకుమార్ మరియు నారాయణవనం మండల ఉపాధ్యక్షులు సతీష్, మరియు జనసైనికులు సుబ్రహ్మణ్యం, కళ్యాణ్, కార్తీక్, తేజ, సుమన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ జగనన్న కాలనీలో ఎలాంటి మౌలిక వసతులు లేవు మరియు అడవిలో జగనన్న కాలనీని ఇవ్వడం జరిగింది. ఈ జగనన్న కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు మరియు సంఘ విద్రోహశక్తులకు నిలియంగా మారే అవకాశం. ఇక్కడ మౌలిక వసతుల కోసం 300 అడుగులు మేర బోర్ వేసినా నీరు లేదు. మరియు జగనన్న కాలనీకి చేరుకోవాలంటే ప్రధాన రహదారి నుంచి మూడు కిలోమీటర్లు వెళ్లవలసిన పరిస్థితి ఉంది మరియు అడవిలో ఉండడం వల్ల ఇక్కడ ఎలాంటి రక్షణ చర్యలు లేవు, ఈ జగనన్న కాలనీ ద్వారా ప్రజాధనం వృధా తప్పించి పేదలకు ఎలాంటి ప్రయోజనం లేదని జనసేన నాయకులు తెలియజేశారు.