కరప గ్రామంలో జనం కోసం పవన్-పవన్ కోసం మనం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, కరప గ్రామంలో గ్రామ అధ్యక్షులు పేకేటి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ శనివారం ఈ గ్రామంలో పర్యటన చేస్తున్న సందర్భంగా పంతంనానాజీ గారికి ప్రజలు వారి సమస్యలను విన్నవించుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. పంచాయితీ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు. సిసి రోడ్లు పల్లం అయిపోవడం వలన నీరు నిలిచిపోతుంది. స్మశానంలో మౌలిక వసతులు లేవు. కరప ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిత్యం అందుబాటులో ఉండడం లేదు అలాగే మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఆపరేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. ఎంతో ప్రతిష్ట కలిగిన 105 సంవత్సరాల చరిత్ర కలిగిన సుబ్రమణ్యేశ్వర స్వామి గుడి చుట్టూ ప్రహరీ కట్టడానికి ఆ గుడి దాతలు చేస్తున్న ప్రయత్నాన్ని స్థానిక వైసీపీ నాయకులు వారి స్వలాభాల కోసం వ్యాపారాల కోసం ప్రహరీ తీయకుండా అడ్డుపడుతున్నారని మొదలైన సమస్యలను గ్రామస్తులు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.