చెరుకూరు రోడ్డుని మరమ్మతులు చేసిన జనసేన నాయకులు

కొండెపి: పొన్నలూరు మండలంలో నాగిరెడ్డిపాలెం నుండి చెరుకూరు గ్రామం వరకు వెళ్లే ప్రధాన రహదారి నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది, ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు ఈ రహదారిని నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పైబడినా ఈరోజుకీ వైసిపి నాయకులు ఈ రహదారిని పట్టించుకున్న పాపాన పోలేదు, వారంలో ఒకటి లేదా రెండు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అధికారులకు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అధికారులుకి కానీ నాయకులుకి గానీ చీమకుట్టినట్టుగా కూడా లేదు, పట్టిపట్టనట్టుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు చందాలు వేసుకుని శనివారం ఈ రహదారిని మరమ్మతులు చేశారు. చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి జనసేన పార్టీ నాయకులందరినీ అభినందించారు. ప్రజలందరూ జనసేన పార్టీకి మద్దతుగా సపోర్టుగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది. 4.5 కిలో మీటర్ల ఈ ప్రధాన రహదారి మరమ్మతులకు సహకరించిన దాతలకు మరియు జనసేన పార్టీ నాయకులకు ధన్యవాదాలు అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐయినాబత్తిన రాజేష్ (సింగరాయకొండ), పిల్లిపోగు పీటర్ బాబు (ఐటీ అధ్యక్షులు) కర్ణ తిరుమలరెడ్డి(ఉపాధ్యక్షులు), పెయ్యల రవికుమార్ యాదవ్ (ఉపాధ్యక్షులు), షేక్ మహబూబ్ బాషా (ప్రధాన కార్యదర్శి), సుంకేశ్వరం శ్రీను (కార్యదర్శి), కాకాని ఆంజనేయులు (కార్యదర్శి), ఖాదర్ బాషా (ప్రధాన కార్యదర్శి), మాల్యాద్రి (కార్యదర్శి), అంకమ్మరావు (కార్యదర్శి), సాయి (ప్రధాన కార్యదర్శి), వేణు, బోయేజ్, ప్రసాద్, సింగరాయకొండ మరియు పొన్నలూరు మండలాల జనసేన నాయకులు పాల్గొన్నారు.