భారీ తుఫానులో సైతం సాగిన జనంకోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో జనంకోసం జనసేన మహాపాదయాత్ర ఉదృతంగా నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తె వందనాంబికలకు గ్రామ ప్రజలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలకడం జరిగింది. తోకాడ గ్రామంలో జనసేన పార్టీకి ప్రజల నుండి ఏకపక్షంగా పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. “జనంకోసం జనసేన మహా పాదయాత్ర” లో భాగంగా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీచైన్లను పంచుతూ రాబోయే 2024 ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు పై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసి మన భావితరాలకు మంచి భవిష్యత్తును ఇద్దామని బత్తుల తెలిపారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏకపక్షంగా మద్దతు తెలియజేసి, రానున్న ఎన్నికల్లో పూర్తిగా జనసేన పార్టీ పక్షాన నిలబడి బత్తుల బలరామకృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తామని యువత కేరింతలతో, అడుగడుగున మహిళల హారతులతో ప్రజానీకం జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టేలా సుదీర్ఘంగా ‘మహాపాదయాత్ర’ సాగింది. రాజానగరం నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ నిత్యం జనంలోనే ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో ఎల్లపుడు తోడుగా ఉంటూ నాయకులు అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన నాయకులు బత్తుల బాలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తోకాడ గ్రామ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.