తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి సిద్ధం

*క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నిర్మల్ జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శంకర్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి సైదాల శ్రీనివాస్ ల ఆదేశాల మేరకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10, 11, 12 తేదీలలో పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ సభ్యులకి జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు కిట్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల కోసం, జనసైనికుల కోసం దేశంలో ఏ పార్టీలో లేని విధంగా సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ అదే కాకుండ పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కోసం, 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. కౌలు రైతుల ప్రతి కుటుంబాలకు ఒక లక్ష రూపాయలు తన స్వంత డబ్బులు ఇచ్చిన గొప్ప త్యాగ మూర్తి అదే విధంగా తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు ప్రమాదవశాత్తు మరణిస్తే మా అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా వారి ఇంటికి వెళ్ళి కుటుంబాలను కలిసి పరామర్శించి 5లక్షల చెక్కును అందజేయడం జరిగింది. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపిటిసి, జడ్పీటిసి, ఎమ్మెల్యే, ఎంపి పదవుల కోసం పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో 5 వేల ఓట్లను ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు కలిగిన పార్టీగా భవిష్యత్ లో కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్ళడానికి జన సైనికులు సిద్దంగా ఉన్నారని తెలియచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జింక హరీష్, కోమటి రాజు, షేక్ ఇమ్రాన్, శషి, బి.రాజు, సవిన్, శివ చరణ్ గౌడ్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.