చింతపల్లిలో జనసేన పార్టీ మండల స్థాయి సమీక్షా సమావేశం

పాడేరు: చింతపల్లిలో సోమవారం జనసేన పార్టీ మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. ఎఈ సమావేశంలో పాడేరు నియోజకవర్గ జనసేనపార్టీ లీగల్ సెల్ ఇన్చార్జ్ కిల్లో రాజన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తదితర మండల నాయకులు, జనసైనికులు ఈ సమావేశంలో పాల్గొని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో నియోజకవర్గ స్థాయిలో చేపట్టాల్సిన ప్రజా రాజకీయ చైతన్య కార్యక్రమంలో పలు అంశాలు గ్రామ స్థాయి మౌళిక సదుపాయాల కల్పన సమస్యలు వంటివి చర్చించారు. ఈ సందర్బంగా కిల్లో రాజన్ మాట్లాడుతూ.. గ్రామస్థాయి ఆదివాసీ ప్రజాసమస్యలు పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేస్తూనే వచ్చాయి. గిరిజన నిరుద్యోగ సమస్య శాతం రోజు రోజుకి పెరుగుతూనే పోతుంది కానీ సరైన ఉపాధి కల్పన లేక సాంప్రదాయ వ్యవసాయ పనులు చెయ్యలేక? యువత అసాంఘిక కార్యాక్రమాలకు ఆకర్షితులై వారి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. గిరిజన ప్రజల పక్షాన నిలవాల్సిన మన ప్రజాప్రతినిధులు తమ బానిసత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వాలు గిరిజన అస్తిత్వంపై దాడులకు పూనుకుంటే ఎదిరించి నిలవాల్సిందిపోయి తానా తందన అంటూ వంతపాడుతూ తమ పదవులు శాస్వతమనే భ్రమలో వున్నారన్నారు. ఈ వైఖరి కచ్చితంగా గిరిజన ద్రోహపు విద్రోహ చర్యలుగానే గిరిజనజాతి భావించాలన్నారు. మన గిరిజన ప్రాంతంలో గిరిజనప్రజలను రాజకీయ చైతన్యం కల్పించడంలో యువత ప్రధాన భూమిక పోషించాలన్నారు. మండల అధ్యక్షులు బుజ్జిబాబు మాట్లాడుతూ రోజుకో గిరిజనహక్కు, పూటకో గిరిజన జీవోను ప్రభుత్వాలు హరిస్తూనే ఉన్నాయి. విద్యావంతులైన యువత సమర్ధవంతమైన నాయకత్వం ఎన్నుకోవడంలో చైతన్యవంతులు కావాల్సిన సమయం ఇదేనని అన్నారు. ఇకపై అవినీతి, బంధుప్రీతి రాజకీయాలను చూస్తూ సహిస్తే భవిష్యత్ అంధకారం కావడం కళ్లెదుటే జరిగిపోతుందని, యువత తమ శక్తి వంఛన లేకుండా నిజాయితీ రాజకీయాలకు, మార్పుకోసం పాటుపడే జనసేన పార్టీ వైపు ప్రజల ఆలోచన తీరు మరల్చేలా తమ ప్రయత్నం చేయాలని అన్నారు. మండల ప్రధాన నాయకుల్లో ఒకరైన ఉల్లి సీతారామ్ మాట్లాడుతు గిరిజన ప్రజల్లో రోజు రోజుకి జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఒక నమ్మకం ఏర్పడుతుందని గిరిజన జాతిపై సహేతుకమైన ఆలోచన ఉన్న నేతగా చెప్పవచ్చని వారహి యాత్ర పూర్తి అయ్యేలోపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోనుందని జనసేన పార్టీ ఆశయాలు, లక్ష్యాలు గిరిజన ప్రజల్లో బలంగా తీసుకెళ్లే విదంగా జనసైనికులు, వీరమహిళలు తమ తమ కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, చింతపల్లి మండల స్థాయి సమావేశంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో మన పల్లె, మన సమస్యలు అనే నినాదంతో గ్రామస్థాయి సమస్యలు వినతిపత్రం రూపంలో స్వీకరించి ప్రభుత్వ పాలకులకు సూటిగా ప్రశ్నించబోతున్నామని, అందుకు గ్రామస్థాయిలో జనసైనికులు తమ గ్రామంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు పరిస్కరించేందుకు తమ వంతు ప్రయత్నంగా వినతిపత్రాలను సమర్పించాలని అందరూ 12 తేదీన బుధవారం లోతుగెడ్డ జంక్షన్ జరిగే సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గోల్లోరి ధర్మారావు, తాంబలి చిన్నారవు, వంతల రాజబాబు, పాంగి రమేష్, చెట్టి స్వామి, మాలే సోమరాజు, వర్మ పాల్గొన్నారు.