జనసేన పార్టీని బలోపేతం చేయాలి

  • మంథని ఇంచార్జి మాయ రమేష్ పిలుపు
  • మహాదేవపూర్ జనసైనికులతో ముఖ్యసమావేశం

మంథని నియోజకవర్గం: మండల కేంద్రంలోనీ జనసేన ముఖ్యనాయకులతో శుక్రవారం సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మంథని ఇంఛార్జి మాయ రమేష్ భూపాలపల్లి, జిల్లా నాయకులు జేరిపోతుల సనత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంథని ఇన్చార్జ్ మాయ రమేష్ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో బూత్ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాలను ఆశయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని, జనసేన పార్టీని బలోపేతం కోసం జనసైనికులు, వీరమహిళలు, ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాల్వ రాజశేకర్, శేషోజ్వాల రాజేష్, కొక్కు నవీన్, పోలోజ్ అవినాష్, తల్లారి ఉదయ్, నారా రవికాంత్ బుర్రి రాకేష్, రామిశెట్టి రాకేష్, చిర్ర రాకేష్ కల్గూరి విజయ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.