గోపాలపురం రోడ్డు దుస్థితిపై జనసేన నిరసన

  • 8కి.మీ మేర 300 జనసైనికులతో మహా పాదయాత్ర

గోపాలపురం నియోజకవర్గం: గోపాలపురం మండల పరిధిలో గోపాలపురం నుంచి సాగిపాడు మధ్య రోడ్డు దుస్థితిపై గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు మహా పాదయాత్ర చేపట్టి నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి సువర్ణరాజు, మండల అధ్యక్షులు పోల్నాటి రాజేంద్ర, గ్రామ అధ్యక్షులు ప్రగడ రాంబాబు, గ్రామ నాయకుల పిలుపు మేరకు ముఖ్య అతిధులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, జిల్లా కార్యదర్శి పాదం కృష్ణ నాయకులు పాల్గొనడం జరిగింది. డా. బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్ధజీవన్, వంగవీటి రంగా ల విగ్రహాలకు పూలమాలవేసి కార్యక్రమం ప్రారంభించారు. 10ఏళ్లుగా రోడ్ అద్వానంగా ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకవడంలేదని, అత్యవసర సమయాల్లో రోడ్ మీద ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, ఇప్పటికి పట్టించుకోకపోతే రహదారిని నిర్భందిస్తామని హెచ్చరించారు. 8కి.మీ 300 జనసైనికులతో పాదయాత్ర నిర్వహించి, తహసీల్దార్ కి వినతిపత్రం అందించారు.