ఒళ్లూరు రోడ్డు దుస్థితిపై జనసేన నిరసన

నెల్లిమర్ల నియోజకవర్గం: డెంకాడ మండలం, మొదవలస పంచాయతీ, ఒళ్లూరు గ్రామానికి ఉన్న రోడ్డు సమస్యను గత కొన్ని సంవత్సరాలుగా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని సోమవారం నెల్లిమర్ల జనసేన సినీయర్ టీం ఎంపీడీఓ, ఎం.ఆర్.ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఎంపీడీఓ, ఎం.ఆర్.ఓ లకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఆ గ్రామానికి మంచినీటి సమస్యపై కూడా దృష్టిపెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదవలస గ్రామ జనసేన నాయుకులు సురేష్ కుమార్, ఎర్నింటి రమేష్, నెల్లిమర్ల జనసేన సినీయర్ నాయుకులు బూర్లే విజయ్ శంకర్, దిండి రామారావు, పిన్నింటి రాజారావు, తోత్తడి సూర్య ప్రకాష్, లింగం రమేష్, పైల శ్రీను, రఘు, పిన్నింటి గౌరీ శంకర్, రాజారెడ్డి, పొంతపల్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.