జి.మాడుగులలో జనసేన ఆత్మీయ సమావేశం

పాడేరు: జి.మాడుగుల మండలంలో జనసేన నాయకులు చురుకుగా గ్రామస్థాయి పర్యటన చేస్తున్నారు. గురువారం గ్రామపర్యటనలో భాగంగా నుర్మాతి పంచాయితిలో వాకపల్లి, నుర్మాతి కొత్తూరు, కరక దాటు గ్రామాలను పర్యటించి స్థానిక పంచాయితి స్థాయి నాయకులతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జి.మాడుగుల మండల నాయకులు అధ్యక్షులు మసాడి భీమన్న మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జనసైనికులున్నారు. వారిని మార్పు కోరే గిరిజన హితమైన రాజకీయలకోసం భాగస్వామ్యం చెయ్యాల్సిన బాధ్యత మనదే రానున్న ఎన్నికల్లో మన శక్తి చాటడానికి ప్రతి గిరిజన యువకుడిని భాగస్వామ్యం చేయాల్సిందే కచ్చితంగా పాడేరు నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపాలాడాల్సిందే సిద్ధాంతం, రాజకీయ ప్రక్షాళనతో కూడిన రాజకీయాలు కేవలం జనసేనపార్టీ మాత్రమే ప్రస్తుతం ఆలోచిస్తుందనే సత్యం చాటి చెప్పాల్సిన అవసరం మనమే తీసుకోవాలన్నారు. అలాగే మండల ప్రముఖ నాయకులు జర్ర అంకిత్ మాట్లాడుతూ.. ఇంతవరకు ఉపాధి లేని ఎందరో నిరుద్యోగులు చదువుకు తగిన వృత్తిలో కాకుండా కూలి పనులు చేసుకుంటూ బిక్కుబిక్కుమంటు జీవిస్తున్నారు. మారాలి వ్యవస్థ మారాలి, రాజకీయ దృక్కోణం మారాలి గిరిజన ప్రజల ఆలోచన విధానం మారాలి మనమే ఆ బాధ్యత తీసుకుని ప్రజలకు చైతన్యవంతం చెయ్యాలి. ఇది మన బాధ్యతగా భావించాలి. భావితరాల భవిష్యత్ కోసం పరితపించి మనమందరు ఏకత్తాటిపై పనిచేయాలి. కచ్చితంగా పాడేరు అసెంబ్లీ స్థానం జనసేనపార్టీ కైవసం చేసుకోవాలి అందుకు తగ్గ ప్రణాళికతో కార్యాచరణ చేయాలన్నారు. ఈ సందర్బంగా వాకపల్లి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు జనసేనపార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ ఆత్మీయసమావేశంలో మండల అధ్యక్షులు, మసాడ బీమన్న, మండల నాయకులు జర్ర అంకిత్, తల్లే త్రిమూర్తి, మాసాడ సింహాచలం. కార్యనిర్వహన కమిటీ సభ్యులు టి. రమేష్, ఉపాధ్యక్షులు ఈశ్వరావు, మండల బూత్ కన్వినర్ బాను ప్రసాద్, గౌరవ అధ్యక్షులు టి. వెంకటరమణ మూర్తి, నగేష్, సోమన్న, తల్లే కృష్ణ, పండన్న ఓలేస్ తదితరులు పాల్గొన్నారు.