రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలం ఎస్.రామన్నపాలెం గ్రామంలో గ్యాస్ లీక్ కారణంగా రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. కుక్క అప్పాయమ్మ కుటుంబానికి చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమవ్వగా, కుక్క వెంకట్రావు ఇంటికి పాక్షిక నష్టం వాటిల్లింది. మంటలు వ్యాపించగా గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, కోరుకొండ నుంచి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమవ్వగా, మరొక ఇల్లు కొంతవరకు రక్షించబడింది. బాధితులను పరామర్శించిన జనసేన మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కొరకు చర్యలు తీసుకుంటామని, అధికారులకు లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుండి బాధితులకు అన్ని సౌకర్యాలు అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు జనసేన తరఫున 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కొంత నగదు సహాయం అందించబడింది. జనసేన పార్టీ ఎప్పటికీ ప్రజలతో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కర్రీ మహేష్, కొమరం దొరబాబు, తురసం రాజకుమార్, ఐనవిల్లి భద్రం, కొత్తపల్లి సతీష్, తుర్రం ధర్మరాజు, తాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment