జయ కుమార్ కుటుంబానికి అండగా నిలబడ్డ జనసేన

  • భార్య నిండు గర్భవతి, ఒక సంవత్సరం పాపాయి
  • మృతుని తమ్మడు దినేష్ రేచీకటితో బాధపడుట
  • డిప్యూటీ సీఎం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి
  • అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా ఆదుకోవాలి
  • ఆర్ధిక సహాయం అందించిన జనసేన ఇంచార్జి డా యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, ఎస్ఆర్ పురం మండలం, ఎగువ కమ్మ కండ్రిగ పంచాయితీ, మిట్టూరు హరిజనవాడలో ఇటీవల మృతి చెందిన జయకుమార్ కుటుంబాన్ని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పరామర్శించారు. ఈ కుటుంబానికి అన్నివేళలా జనసేన అండగా ఉంటుందని భరోసా కల్పించారు. భార్య నిండు గర్భిణీ, ఒక సంవత్సరం నిండిన పాపను కలిగి ఉన్నారని, కడు బీదరికంతో కుటుంబం సాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జయకుమార్ తమ్ముడు దినేష్ బీకాం డిగ్రీ చదివి, నిరుద్యోగిగా, రేచీకటితో బాధపడుతున్నాడని, డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకొని, అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా ఉపాధి కల్పించాలని, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. మండల కమిటీ నాయకులు అత్యవసరంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యలే అజెండాగా పనిచేస్తారని, రానున్న రోజుల్లో ప్రజలకు అండగా నిలబడతారని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ ఈ కుటుంబానికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి నరేష్, యువత అధ్యక్షులు సుమన్, జనసైనికులు మరియు గ్రామస్తులు ఉన్నారు.