జిల్లా కలెక్టరుకు వినతిపత్రమిచ్చిన జనసేన

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, జి.మాడుగుల మండలం కులపాడు గ్రామస్తులు సుమారు 50 మంది గ్రామస్తులతో కలిసి గురువారం పాడేరు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో నేషనల్ హైవే ఎన్.హెచ్ 516 మూలంగా నివాసం కోల్పోతున్నాం ప్రత్యామ్నాయంగా ఊరు దిగువన 1/2 కిలోమీటర్ల దూరంలోగల ప్రాంతం గుండా హైవే మళ్ళింపు జరిపితే సుమారు 76 కుటుంబాలు స్థిరనివాసాలు కోల్పోకుండా ఉండొచ్చని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించడమైనది. గ్రామస్తుల అభ్యర్థన ఏమనగా గతంలో మా గ్రామం గుండా ఎన్.హెచ్ 516 నేషనల్ హైవే వెళ్తుందని అందుకు గాను సర్వే చేశారు. ఆ సర్వేలో ఒకరి ఇళ్ళు ఒకరి పేరున ఇలా తప్పులుగా సర్వే చేసారు. మేము గ్రామస్తులమంతా కూడా నేషనల్ హైవే ఎన్.హెచ్ 516 కి వ్యతిరేకం కాదని, మా గ్రామం పరిధిలో కాకుండా గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరాన హైవే మళ్ళిస్తే చాలని మేమంతా పేద గిరిజనులమని మళ్ళీ గృహ నిర్మాణం చేసుకునేంత స్తోమత లేదని తెలిపారు. ఈ సందర్బంగా జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.గంగులయ్య స్పందిస్తూ కులపాడు గ్రామస్తులందరూ వచ్చే జాతీయ రహదారి ఎన్.హెచ్ 516 కి వ్యతిరేకం కాదని, కానీ వారి అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని నష్టపరిహారం చెల్లించే కంటే కూడా నష్టనివారణ చర్యలు చేపట్టడం ఉత్తమమని జిల్లా కలెక్టర్ కి ఒక నివేదిక పత్రం సమర్పించమని తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామస్తులతో పాటుగా జి.మాడుగుల మండల జనసేన పార్టీ అధ్యక్షులు మాసాడి భీమన్న, క్రాంతి కుమార్, సుమారు 50 మంది గ్రామస్తులు జనసేనపార్టీ పార్టీ ఇన్చార్జ్ డా.గంగులయ్యతో కలిసి కలెక్టరేట్ చేరుకుని వినతిపత్రం సమర్పించారు.