టీడీపీ నిరసన దీక్షకు జనసేన మద్దతు

నూజివీడు నియోజకవర్గం: అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోనీ రమణక్కపేట గ్రామంలో టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ రంగు ఆంజనేయులు అధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసన దీక్షలో నూజివీడు నియోజకవర్గ ఇంచార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు టీడీపీ రాష్ట్ర యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దె రఘు, టీడీపీ గ్రామ శ్రేణులతో కలిసి రిలే దీక్షకు నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున మద్దతు తెలిపిన నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబు ఆయనతో పాటు మండల జనసేన నాయకులు వేట త్రినాథ్, ఉప్పే నరేంద్ర, రంగు సుబ్బారావు, చేకూరి అనిల్, సాయి, ప్రసాద్, భయం సతీష్, గుండా ల శివ, బర్మా సాయి, సూర్య తదితరులు పాల్గొన్నారు.