పూసపాటిరేగ మండలంలో జనసేన కార్యవర్గ సమావేశం

  • కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పితాని బాలకృష్ణ
  • రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ మైలేజ్ పెంచేలా యువశక్తి సభ నిర్వహణ

నెల్లిమర్ల: జనవరి 12 న జరగబోయే జనసేన యువశక్తి కార్యక్రమానికి సన్నద్ధం చేయడానికి నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలంలోని జనసేన కార్యవర్గం సమావేశం అయినది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మడివరం నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ మైలేజ్ పెంచేలా ఈ యువశక్తి సభ నిర్వహించబడుతుందని, పూసపాటిరేగ మండల జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు రానున్న రెండు మూడు రోజులు ప్రజలకు యువశక్తి సభ గురించి అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలు మాట్లాడుతూ యువశక్తి కార్యక్రమం ఉత్తరాంధ్ర వెనుకబాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని, యువత కోసం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఆలోచించే వ్యక్తి అని, ఆయన తెలుగు జాతికి, రైతాంగానికి చేస్తున్న విశేషమైన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మహిళా కోర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్ మాట్లాడుతూ ఈ బూటకపు ప్రభుత్వం వ్యవస్థను నాశనం చేస్తుందని మండిపడ్డారు. జనసేన మండల అధ్యక్షులు జలపారి అప్పడుదొర మాట్లాడుతూ ఈ ప్రభుత్వం యువతీ యువకుల భవిష్యత్తు నాశనము చేస్తూ, సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలో నెడుతుందని ఈసారి యువత అంతా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలని కురుక్షేత్రంలో అర్జునుని చేతిలో బ్రహ్మాస్త్రంలా జనసేనాని చేతిలో యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోకం ప్రసాద్, రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, మండల అధ్యక్షులు పతివాడ కృష్ణవేణి, అచ్చెన్నాయుడు, వందనాల రమణ, సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, దిండి రామారావు, తొత్తడి సూర్యప్రకాష్, బలభద్రుని జానకీరామ్, రాలి రమణ, దుక్క అప్పలరాజు, మాదేటి ఈశ్వర్రావు, స్మార్ట్ రమేష్, లెంక సురేష్, పిన్నింటి ప్రమోద్, అప్పలనాయుడు, సురేష్, అల్లుడు శ్రీను, తాతారావు, అల్లాడ రాము, జగదీష్, వంశీకృష్ణ, హరి, తోటరెడ్డి, కోండ్రు సురేష్, మొల్లి రమేష్, బోనెల నర్సింగ్, సత్యకీర్తి, కె పి రెడ్డి, కె రమణ, కె సిద్దు, బి. సాయి, పి. ఆది, బి. సూర్యప్రకాష్, ఎన్. సంతోష్, కన్నయ్య తదితర జనసైనికులు పాల్గొన్నారు.