వి.ఆర్.పురం వెలుగు కార్యాలయాన్ని బుధవారం జనసేన నాయకులు పరిశీలించారు. మండల జనసేన అధ్యక్షులు ములకాల సాయికృష్ణ నేతృత్వంలో జనసైనికులు కార్యాలయాన్ని సందర్శించి, డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు, సమావేశాల నిర్వహణ, ఉపాధి పనుల పురోగతిపై సిబ్బందిని ప్రశ్నించారు. సాయికృష్ణ మాట్లాడుతూ.. “సుపరిపాలన కోసం అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. బిల్లులు చెల్లింపులు, పెండింగ్ సమస్యలు ఉన్నచో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తాం,” అని తెలిపారు. వెలుగు సిబ్బంది, ఏ.పి.ఏం స్వామి నుండి పూర్తి వివరాలు తెలుసుకున్న జనసేన నాయకులు, అధికారులు మరియు గ్రూప్ సభ్యుల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తమ సమస్యలుగానే తీసుకొని, నిబద్ధతతో పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్శనలో మహిళా అధ్యక్షురాలు బాగుల ప్రమీల రాణి, కార్యదర్శి బాగుల అంజన్ రావు, ముంజపు సాయిరాం, పెడపెట్ల పవన్ కళ్యాణ్, ముత్యాల దుర్గాప్రసాద్, శ్రీరామ్, వేణు, శేషు, నీలరాజు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment