అంతర్జాతీయ విమానాల ప్రయాణంపై నిషేధం తొలగించిన జపాన్‌

కోవిడ్-19 నేపథ్యంలో గత కొన్ని నెలలుగా వివిధ దేశాల నుంచి నిలిచిపోయిన అంతర్జాతీయ విమానాలకు అనుమతి ఇవ్వాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 10 దేశాలకు అంతర్జాతీయ ప్రయాణం విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతుండటం, కొన్ని దేశాలలో అంతర్జాతీయ ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేయడంతో జపాన్ కూడా త్వరలో ప్రయాణంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్న నిర్ణయానికి వచ్చింది. వచ్చే నెల నుంచి 10 దేశాలకు అంతర్జాతీయ ప్రయాణ నిషేధాన్ని తొలగించనున్నారు. ఈ చర్య జపాన్ ప్రజలకు ప్రయాణ అడ్డంకులను తొలగించడానికి ఇతర దేశాలకు స్ఫూర్తినిస్తుందని వారు ఆశిస్తున్నారు. అయితే, ఇంకా నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య తక్కువగా దేశాలకు తొలుత విమానాలు నడుపనున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వియత్నాం వంటి ప్రదేశాలు ఉంటాయని భావిస్తున్నారు.