1417 పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ విడుదల: IBPS PO 2020

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు మరో అవకాశం ఇచ్చింది. వివిధ బ్యాంకుల్లో ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీఓ) పోస్టుల సంఖ్య‌ను పెంచింది. ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) కోసం 1167 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. వాటికి మరో 250 పోస్టులకు పెంచుతూ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో పోస్టుల సంఖ్య 1417కు చేరింది. పూర్తి వివరాలకు

పోస్టులు: 1417

బ్యాంక్ ఆఫ్ ఇండియా: 734

యూకో బ్యాంక్‌: 350

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 250

పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌: 83

ముఖ్య సమాచారం:

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

వ‌య‌సు: 20-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌ (ప్రిలిమిన‌రీ, మెయిన్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థలకు రూ. 850, మిగిలిన వారికి రూ.175

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 05.08.2020

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 26.08.2020

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: అక్టోబ‌రు 3, 10, 11

మెయిన్ ప‌రీక్ష తేది: 28.11.2020

ఇంట‌ర్వ్యూ: జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రి 2021 వెబ్‌సైట్‌: https://www.ibps.in/