జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన, తెలంగాణ రాష్ట్ర బాధ్యులు నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు తాళ్ళూరి రామ్ నేతృత్వంలో ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్న దుంపటి శ్రీనివాస్, విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న మిరియాల రామకృష్ణ, విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బండి నరేశ్, విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర అర్గనైజింగ్ కార్యదర్శిగా పని చేస్తున్న కొండా పవన్ కుమార్, హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కమిటీల నియామకం, మార్చ్ 14న జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల గురించి పార్టీ పెద్దలతో చర్చించడం జరిగింది.