‘జ్వాల ‘ ఫస్ట్ లుక్‌

బిచ్చగాడు చిత్రంతో తెలుగులో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్‌ ఆంటోని నటిస్తోన్న చిత్రం (తెలుగు వెర్షన్‌) జ్వాల. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎం డైరెక్ట్ చేస్తున్నాడు. అరుణ్ విజయ్ కీ రోల్ పోషిస్తున్నాడు. కోల్‌కతాలో ఈ ప్రాజెక్టు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. లాంగ్ హెయిర్ స్టైల్ తో తలుపు తీసి బయటకొస్తున్నట్టుగా కనిపిస్తున్న స్టిల్ సస్పెన్స్ గా ఉంది. అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై టీ శివ నిర్మిస్తున్నారు. జ్వాలలో నాజర్‌, అక్షర హాసన్‌, ప్రకాశ్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

విజయ్ ఆంటోని సీనుగా కనిపించనున్నట్టు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. నటరాజన్ శంకరన్ మ్యూజిక్ డైరెక్టర్‌. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో జ్వాల వస్తోంది. లాక్ డౌన్ తర్వాత సినిమాల స్పీడు పెంచాడు విజయ్ ఆంటోని. ఇటీవలే విజయరాఘవన్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.