గెలుపు పై విశ్వాసం.. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి బీజేపీలోకి..

హెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలుపు పై  విశ్వాసం రోజు రోజుకూ పెరుగుతోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. ఒకరు కొట్టినట్లు.. ఇంకొకరు ఏడ్చినట్లు చేస్తున్నారని వ్యగ్యాస్త్రాలు సంధించారు. 2016 మేనిఫెస్టోలోని అంశాలనే 2020లో తెరాస చేర్చిందని ఆమె తెలిపారు. 2016 మేనిఫెస్టోలో పేర్కొన్న ఎన్ని హామీలను నెరవేర్చారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనేక మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరుతారన్నారు.

కేసీఆర్ హైదరాబాద్‌ను కొడుకు కేటీఆర్ చేతిలో పెట్టారు తప్ప ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తండ్రి, కొడుకులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. భాజపా పాలిత పట్టణాల అభివృద్ధిని చూసొద్దాం వస్తారా? అని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. పాతనగరంలా హైదరాబాద్ కావద్దు అంటే భాజపాను గెలిపించాలని అన్నారు.