కె.టి.ఆర్. కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

టి.ఆర్.ఎస్.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి, సహృదయులు కల్వకుంట్ల తారక రామారావు (కె.టి.ఆర్.) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాలికి తగిలిన గాయం వల్ల కె.టి.ఆర్. గారి ప్రజాసేవకు కొంత అంతరాయం కలిగిందని తెలిసింది. గాయం నుంచి కోలుకుని యధావిధిగా ఆయన ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్షిస్తున్నాను. కె.టి.ఆర్.గారికి దీర్ఘాయుష్షు, ఆనందకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.