మాగుంట రాఘవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కనపర్తి మనోజ్ కుమార్

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో మాగుంట రాఘవరెడ్డి, బెల్లం సత్యనారాయణలను మర్యాదపూర్వకంగా కలిసిన కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, దాదాపుగా 30 నిమిషాల పాటు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు మరిము ప్రజా సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు గురించి రాఘవరెడ్డి మరియు మనోజ్ కుమార్ లు మాట్లాడుకోవడం జరిగింది. కొండపి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుడు యువకుడు విద్యావంతుడు మనోజ్ కుమార్ వలన యువతలో నూతన ఉత్సాహం ఏర్పడింది, మార్పు వచ్చింది ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే విషయంలో ప్రముఖ కీలకపాత్ర పోషిస్తారు. మాగుంట కుటుంబం మనోజ్ కుమార్ కి అండగా కూడా ఉంటుంది అంటూ రాఘవరెడ్డి తెలియజేశారు.