ఆలమూరు గ్రామ జనసేన అద్యక్షుడిగా కట్టా రాజు..!

ఆలమూరు గ్రామ జనసేన పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక! గ్రామ అధ్యక్షులుగా కట్టా రాజు! శెట్టిబలిజ సామాజికవర్గం నేత!బండారు శ్రీనివాస్!

ప్రజలలో మార్పు మొదలైందని, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక నమ్మకమైన నాయకుడిగా, ప్రజలకు జనసేనాని ఆశయాలు ప్రతి ఒక్కరికి నచ్చి, మెచ్చి ఆకర్షితులవుతున్నారు, అన్ని వర్గాల నుంచి ఈ భారీ చేరికలు జనసేన పార్టీ బలోపేతానికి నిదర్శనం!

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలో, ఆలమూరు మండలంలోని, ఆలమూరు గ్రామమునకు చెందిన జనసేన పార్టీ నూతన కార్యవర్గం లాంఛనంగా ఎన్నిక కాబడినది. ఆలమూరు గ్రామం జనసేనపార్టీ అధ్యక్షులుగా కట్టా రాజును, గ్రామ జనసైనికులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పలువురు గ్రామస్తులు, అన్ని వర్గాల నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరినారు. పార్టీలోకి చేరిన వారిని ఎంతో ఆత్మీయతతో దుశ్శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి అభినందనలు బండారు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ భారీ చేరికలతో జనసేనపార్టీ ఆలమూరు మండలంలోనూ, గ్రామం లోనూ మరింత బలోపేతంమై, తిరుగులేని శక్తిగా బండారు శ్రీనివాస్ నాయకత్వంలో అంచెలంచెలుగా బలోపేతమై పటిష్టమైన స్థాయికి చేరుకున్నదని, ఆలమూరు గ్రామ ప్రజలు, జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు జిల్లా జాయింట్ సెక్రటరీ తాళ్ల డేవిడ్, కొత్తపేట మండలం పలివెల శివారు తులా రాజు, మరొక జిల్లా కార్యదర్శి, పినపల్ల సర్పంచ్ సంగీత సుభాష్, జనసేన పార్టీ ప్రముఖ సీనియర్ నాయకులు గారపాటి త్రిమూర్తులు, ఆలమూరు మండల జనసేన అధ్యక్షులు సురపు రెడ్డి సత్య, జనసేన యువ నాయకులు సలాది జయప్రకాష్ నారాయణ (జెపి), జనసేన సీనియర్ నాయకులు ధనరాజ్ నాయుడు, చల్ల వెంకటేశ్వర రావు, సిరిగిరి పట్టాభి, పసుపు లేటి సాయిబాబా, లంకే సతీస్, ఎరుకొండ విశ్వేశ్వర రావు, గుత్తుల రాంబాబు, నాసిక వెంకటేశ్వరరావు, కొండేపూడి వరప్రసాద్ రావు, వీరమహిళ జనసేన బిసి శెట్టిబలిజ సామాజిక వర్గం నేత కోట వరలక్ష్మి, పలువురు కార్యవర్గ సభ్యులు, జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.