యాదాద్రి పర్యటనలో కేసీఆర్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఆలయ ద్వారం బయట నుంచే లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం కేసీఆర్ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిoచారు.

యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఆలయ పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయి. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్. యాదాద్రికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆయన ఆదివారం యాదాద్రి పర్యటనకు వచ్చారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, విప్ గొంగిడి సునీత, ఎంపీ సంతోశ్ కుమార్‌, ఇతర నేతలు, అధికారులు ఉన్నారు.