కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. ఇంటి వద్దకే ఆక్సిజన్ కాన్సంట్రేటర్

కరోనా రాకాసి విరుచుకుపడుతున్న వేళ శనివారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రతిజిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ వాసులకు ఈ రోజు నుంచి ఒక ముఖ్యమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రతి జిల్లాలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కోబ్యాంకులో 200 కాన్సంట్రేటర్లు ఉంటాయని.. కోవిడ్ బాధితులకు అవసరమైనప్పుడు ఆక్సిజన్ లభించక ఐసీయూల్లో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీంతో అమూల్యమైన మరణాలను కోల్పోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు ఆక్సిజన్ అవసరమైతే.. రెండు గంటల్లో తమ బృందం హోం డెలివరీ చేస్తుంద సీఎం కేజ్రీవాల్ తెలిపారు.