ఖమ్మం జనసేన నగర కమిటీ సమావేశం

తెలంగాణ, ఖమ్మం, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తరుణంలో రాబోయే రోజుల్లో పార్టీ చేయబోయే కార్యక్రమాల ప్రణాళికలను, బూత్ కమిటీల గురించి చర్చించడానికి ఖమ్మం నగర కమిటీ మరియు వివిధ సంస్థాగత కమిటీలతో ఖమ్మం నియోజకవర్గ అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జి రామకృష్ణ మిరియాల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మేడబోయిన కార్తీక్, ప్రధాన కార్యదర్శి అజయ్ కృష్ణ ఉపాధ్యక్షులు దేవేందర్, హసీనా, ఉత్తమ్ రాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్, పవన్ కళ్యాణ్ సెక్రటరీ నర్సింహారావు, పుల్లారావు, ఫయాజ్ కార్యవర్గ సభ్యులు దుర్గాప్రసాద్ ఖమ్మం నగర విద్యార్థీ విభాగం అధ్యక్షులు తుమ్మలపూడి గంగాధర్ ప్రధాన కార్యదర్శి రాకేష్ ఉపాధ్యక్షులు ఉదయ్, విజయ్ 57వ డివిజన్ అధ్యక్షులు దుండుగుల నాగరాజు ఇతర డివిజన్ మెంబెర్స్ వంశీ, దీపక్, దావీదు, రాముడు, నరేష్, గోపి తదితరులు పాల్గొన్నారు.