మహాత్మునికి ఘన నివాళులర్పించిన దాసరి రాజు

ఇచ్చాపురం: జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా బెల్లిపడలో గాంధీ విగ్రహాన్ని నిర్మించిన ఉల్లాసి లోహిదాస్ ఆధ్వర్యంలో
జనసేన ఇచ్చాపురం ఇంచార్జ్ దాసరి రాజు జనసేన నాయకులు, జనసైనికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ గాంధీ గారి అహింస మార్గంలో యువత నడుచుకొని వాళ్ళ భవిష్యత్తు బంగారుబాట వేసుకోవాలి అని సందేహం ఇచ్చారు. అలానే లాల్ బహుధుర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ బెల్లిపడకి చెందిన విగ్రహ ప్రతిష్ట దాన కర్త ఉల్లాసి లోహిదాస్ మరియు జనసేన నాయకులు ఇచ్చాపురం మున్సిపాలిటీ 10,11, వార్డ్ ల ఇన్చార్జిలు రోకళ్ళ భాస్కరరావు, కలియ గౌడో, నీలపు సతీష్ శివ, అజయ్ కుమార్, దిలీప్, లోహిదాష్, హేమంత్, కుమార్, పాపారావు, గణేష్, శివ, జానకిరావు, రవాణా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.