కామెడీ కింగ్ గా మాట్లాడుతున్న కొడాలి నీకు రోజులు దగ్గర పడ్డాయి – సందు పవన్

గూడివాడ, ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని నోరెత్తితే కామెడీ కింగ్ గా, నీవు మా నాయకుడు పవన్ కళ్యాణ్ ని విమర్శించడం చూస్తుంటే జబర్దస్త్ లో బిల్డప్ బాబాయ్ గా నోటికి ఏది వస్తే అది మాట్లాడే నిన్ను చూస్తుంటే హాస్యం వేస్తుందని జనసేన నియోజకవర్గం సందు పవన్ ఘాటుగా విమర్శించారు. ఆదివారం స్థానిక భాస్కర్ థియేటర్ రోడ్ లో గల జనసేన అభిమాని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి పేర్ని. జగన్, వెలుతురుమిల్లి సర్పంచ్ కె.శేషవేణి, నాయకులు పాలంకి సారధితో కలిసి సందు పవన్ మాట్లాడుతూ ఇప్పటం గ్రామంలో 600 కుటుంబాలకు 120 అడుగుల రోడ్లు వేస్తే మంచిదేగా అనే నీవు నాలుగు లక్షల 50 వేల జనాభా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని 20 సంవత్సరాల కాలంలో ఎందుకు 120 అడుగుల రోడ్డు వేయలేదు అన్నారు. నేషనల్ హైవేలు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయన్న విషయం కూడా తెలియని రాజకీయ అజ్ఞాని నువ్వని, కే ఏ పాల్, పవన్ కళ్యాణ్ ఒకటేనన్న కొడాలి నాని, 5 శాతం ఉన్న నీవు 95 శాతం ఉన్న ప్రజలను ఏ విధంగా పాలిస్తున్నావు అర్థం కావడం లేదు అన్నారు. నీ ధన బలంతో గుడివాడ ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తావన్నారు. ప్రతిసారి డబ్బు పని పనిచేయదని గుర్తుపెట్టుకోమన్నారు. గుడివాడ ప్రజలు త్వరలోనే నిన్ను తన్ని తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గడపగడపకు పేరుతో బిల్డప్ బాబాయిగా మీ పార్టీ వాళ్ళ ఇంట్లో రెండేసి గంటలు ఉంటే ప్రజా సమస్యలు నువ్వు ఎలా తెలుసుకుంటావన్నారు. నీకు అనుకూల మీడియాలో రాష్ట్రస్థాయి నాయకులను విమర్శిస్తూ కామెడీలు చేస్తున్న నువ్వు, పేద ప్రజల పక్షాన నిలబడే పవన్ కళ్యాణ్ ని విమర్శించడం మానుకోకపోతే నీకు తగిన గుణపాఠం నేర్పించడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు మాచర్ల. రామకృష్ణ, షేక్ మీరా షరీఫ్, షేక్ రబ్బాని, పేర్ని ప్రమీల రాణి, బొల్ల త్యాగరాజు, కొట్టే శివ, వడ్డే గిరి, అర్జ కృష్ణ, గంటా చైతన్య, నూనె అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.