కస్టడీ అనంతరం కోర్టుకు హాజరైన కోటా చంద్రబాబు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా భర్త, జనసేన పార్టీ నాయకులు కోటా చంద్రబాబు కు బెయిల్ రానివ్వకుండా చేయడానికి స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీస్ కస్టడీ పేరుతో మంగళవారం శ్రీకాళహస్తి సబ్ జైలు నుండి ఏర్పేడు పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్లడం జరిగింది. వందల మంది జనసైనికులు శ్రీకాళహస్తి సబ్ జైలు నుండి పోలీస్ వాహనాన్ని అనుసరిస్తూ ఏర్పేడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం జరిగింది. కస్టడీ అనంతరం ఏర్పేడు పోలీస్ స్టేషన్ నుండి శ్రీకాళహస్తి కోర్టు జడ్జి ముందు హాజరు పరిచి తిరిగి శ్రీకాళహస్తి సబ్ జైల్ నందు కోటా చంద్రబాబు ను హాజరుపరచుట జరిగింది. బెయిల్ కు కాలయాపన కోసమే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్రమ కేసు పెట్టి మానసికంగా హింసించబడము కొరకు ఈ విధమైన చర్యలు పోలీసులు చేస్తున్నారని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వినుత కోటా ఆరోపించారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ఆదేశాల మేరకు లీగల్ సెల్ విభాగం నుండి లాయర్లు లీగల్ సెల్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు అమర్ నారాయణ, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షురాలు కంచి శ్యామల, లీగల్ సెల్ టీం మంజునాథ, శ్రీహరి, జయచంద్ర, విజయభాస్కర్ పోలీస్ స్టేషన్ నందు కస్టడీ ముగిసే వరకు కోటా చంద్రబాబు కు అండగా నిలబడ్డారు.