ఎంపీ మనోజ్ కొటక్ ను సత్కరించిన కొట్టె మల్లికార్జున

తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఇన్ ఛార్జ్ గా మహారాష్ట్ర బాంబే ఎంపీ మనోజ్ కోటక్ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో పాటు, రాష్ట్ర బిజెపి నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.. మహారాష్ట్ర నుంచి ఎన్నికల ప్రచారానికి విచ్చేసినటువంటి మనోజ్ కోటక్ ను హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖైరతాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి, ఇతర బిజెపి నాయకులు సన్మానించడం జరిగింది. బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ బాంబే ఎంపీ మనోజ్ కోటక్ ను కలిసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించడం జరిగింది. అలాగే హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో బిజెపి పెద్దలు చింతల రామచంద్ర రెడ్డి గెలుపు కోసంమనోజ్ కోటక్ సారథ్యంలో, గౌతమ్ రావు సూచనలతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్, సోమాజిగూడ, బంజార హిల్స్ అలాగే ఇతర డివిజన్లలో ప్రచారం నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ప్రతి ఒక్కరు ఇంటింటికి గడప కార్యక్రమం ద్వారా ప్రతి డివిజన్లలో, ప్రతి వీధిలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖైరతాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. బిజెపి పార్టీ ఖచ్చితంగా నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, శ్రీ చింతల రామచంద్రారెడ్డి ఖైరతాబాద్ లో అఖండ మెజారిటీ తో గెలువబోతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతం రావుకి, ముఖ్య అతిథిగా హాజరైన బాంబే ఎంపీ మనోజ్ కోటక్ కు, ఇతర బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.