తెలంగాణలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌.. తొలి వ్యాక్సిన్ తీసుకున్న కృష్ణమ్మ

తెలంగాణ రాష్ర్టంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన తర్వాత హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో సఫాయి కార్మికురాలు ఎస్ కృష్ణమ్మ కరోనా టీకా తీసుకున్నారు. ఈమెనే కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కారు. టీకా తీసుకున్న తర్వాత ఆమెతో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆమెను అబ్జర్వేషన్ గదికి తరలించారు.

అలాగే తెలంగాణాలో 33 జిల్లాలో ఏర్పాటు చేసిన 139 ఆరోగ్య కేంద్రాలలో కోవిషీల్డ్ టీకా కార్యక్రమాన్ని ముందుగా నమోదు చేసుకున్న హాస్పటల్స్ సపాయి కార్మికులకు, ఇతర వైద్య సిబ్బందికి వేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో నేడు 30 మందికి మాత్రమే ఈ టీకాను వేయనున్నారు.