పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి కె.ఎస్.ఎస్ స్థాయిశక్తులా పనిచేస్తుంది

అనకాపల్లి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మినిస్టర్ చేగొండి హరి రామ జోగయ్య ఆదేశాలతో అనకాపల్లి పార్లమెంటరీ పిక్నిక్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లాల అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, బైరా దిలీప్, పాయకరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు గడ్డం బుజ్జి, కాపు సంక్షేమ సేన ఉత్తరాంధ్ర ఇన్చార్జి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు గుర్రాల శ్రీనివాసరావు, కాపు సంక్షేమ సేన విశాఖపట్నం సిటీ ప్రెసిడెంట్ బద్ధి కనకదుర్గ, భారీ ఎత్తున కాపు సంఘాల నాయకులు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేశారు. కాపు సంక్షేమ సేన జనసేన పార్టీకి అనుసంధానమని ఈ సంస్థ పవన్ కళ్యాణ్ 2024 లో ముఖ్యమంత్రి అవటానికి స్థాయిశక్తులా పనిచేస్తుందని తెలిపారు.