ముద్రగడను ప్రశ్నించిన కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం, ముద్రగడ పద్మనాభం మీరు వైసిపి పార్టీలో చేరినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు మీ ముసుగు తొలగించుకొని మీ నిజస్వరూపాన్ని మాకు చూపినందుకు ఆనందిస్తున్నాం. స్వయానా మీరు ప్రెస్ మీట్ లో, వైసిపి పార్టీ ఆవిర్భావంలో నేను కూడా ఒక ఫౌండర్ నే కొన్ని అనివార్య కారణాలవల్ల ఇంతకాలం వైసిపి పార్టీకి, జగన్ మోహన్ రెడ్డికి సేవ చేయలేకపోయానని సెలవిచ్చారు. మీరు ఇప్పుడు వైసీపీ నాయకులు కదా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు బహిరంగ లేఖలు రాయండి జగన్మోహన్ రెడ్డికి, కాపు కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం 2000 కోట్లు ఇస్తామన్నాడు ఎందుకు ఇవ్వలేదు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు వివరించగలరా? వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేంద్రం ఇచ్చిన ఓబీసీ కోటాలో కాపులకు ఎందుకు రిజర్వేషన్ అమలు చేయలేదో తెలపగలరా? ఈ మధ్యకాలంలో మీరు జ్యోతిష్య శాస్త్రం నేర్చుకున్నట్లున్నారు. జనసేన క్లోజ్ అంటున్నారు? ఇంకా 30 ఏళ్లకాలం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారు చరిత్ర సృష్టిస్తారని చెబుతున్నారు? ఐదేళ్లకే రాష్ట్ర ప్రజల బతుకులు అల్లకల్లమయ్యాయి? సొంత కోటరీ ఏర్పరచుకొని దందాలు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా ఎందుకు కొనసాగాలో మీరు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి. బిజెపి పార్టీలోకి నన్ను ఆహ్వానించారని ప్రత్యేక హోదా ఇవ్వండి? పోలవరాన్ని మీరే కంప్లీట్ చేయండి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి? అని అడిగాను అని చెబుతున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు మీరు వైసిపి నాయకులు కదా మీరు మీ జగన్మోహన్ రెడ్డి జరగబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాలు పొందుపరచగలరా? 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ప్రధాన హామీలైన పై అంశాలు ఈ ఐదేళ్ల కాలంలో ఎందుకు పూర్తి చేయలేదో సెలవివ్వగలరా? మా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి 1962 నుంచి ఉంది, నాటినుండి నేటి వరకు కేవలం 5% కాపులే మాకు సహకారాన్నందించారు? మిగతా కాపులంతా మాకు సహకరించలేదని చెప్తున్నారు? అందుకేనా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మా ఇంటిలోకి కాపులకు ప్రవేశం లేదని ఇంటి ముందు బోర్డు పెట్టారు? అందుకేనా కాపు ఉద్యమాన్ని మీరు మధ్యలో వదిలేశారు? అందుకేనా మీరు గతంలో ప్రజారాజ్యానికి, నేడు జనసేన పార్టీకి సహకారాన్ని అందించకుండా విషం వెళ్లగక్కుతున్నది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని పదేపదే సినిమా వాడని హేళన చేస్తున్నావ్? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల సాధన కోసం జనసేన పార్టీ నడుపుతున్న మహోన్నతమైన వ్యక్తి, రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని తెలుసుకోండి. మీలాగా వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజన కోసం పనిచేసే వ్యక్తి కాదని తెలుసుకోండి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వచ్చి ఉంటే? అప్పుడు పవన్ కళ్యాణ్ మీకు సినిమా వాడు కాకుండా? స్వచ్ఛమైన రాజకీయ నాయకుడులాగా కనపడి ఉండేవాడా? అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ప్రశ్నించారు.