భక్తులతో పోటేత్తిన శ్రీ వల్లి దేవాయాని సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం

కోనసీమ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు గోదావరి సమీపంలో ఏటిగట్టు క్రింద చరిత్రక ప్రసిద్ధిచెందిన రెండు ఆలయాలు వున్నాయి. శ్రీ బాలత్రిపురసుందరి సమేత శ్రీ గౌతమేశ్వర స్వామి వారి ఆలయం ఒకటి. ప్రక్కనే శ్రీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్ల కళ్యాణం జరిగింది. సోమవారం ఆలయం వద్ద ఉన్న వందల ఏళ్ల చరిత్ర కలిగిన మర్రిచెట్టు ఉంది. పూర్వ కాలంలో ఈ మర్రిచెట్టు వద్ద పెద్ద సర్పం ఉండేది అని అక్కడనాగుల చవితి, సుబ్రహ్మమణ్య షష్టి జరుగేది అని, అనంతరం ఎక్కడ శ్రీ దేవసేనసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిఆలయం నిర్మించారు. ఆలయంలో, మర్రిచెట్టు వద్దభక్తులు మొక్కు బడులు తీర్చుకుంటారు. షష్టి నాడు రాత్రి కళ్యాణం, తీర్ధం జరిగింది.