నారా లోకేష్ కు వినతిపత్రమిచ్చిన గజపతినగరం జనసేన నాయకులు

గజపతినగరం, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గజపతినగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రాపు సురేష్, విజయనగరం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన మరియు టిడిపి ఇంచార్జ్ డా.కే నాయుడు నారా లోకేష్ కి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు వివరించి, వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం మరియు జనసేన ప్రభుత్వం ఏర్పడక ప్రధానమైన సమస్యలపై మీరు స్పందించి తగు న్యాయం చేయాల్సిందిగా కోరడం జరిగింది. గజపతినగరం నియోజకవర్గంలో గంట్యాడ మండలంలో ఉన్నటువంటి తాటిపూడి జలాశయం మరమ్మతులు చేసి కాలువలు బాగు చేసి పంటకు నీరు అందే విధంగా కృషి చేయాలని కోరడం జరిగింది, అలాగే జామి మండలం భీమసింగ్ సుగర్ ఫ్యాక్టరీకు ఐదు కోట్లు మంజూరు చేసి, ఫ్యాక్టరీ మళ్లీ రీస్టార్ట్ అయ్యే విధంగా కృషి చేయాలని కోరడం జరిగింది. జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించాలి, శ్రీకాకుళం విజయనగరం జిల్లా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తే, యువతకి మంచి శిక్షణ, తద్వారా ఉపాధి అవకాశం ఏర్పడుతుంది, జిల్లాలో నాలుగు సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరడం జరిగింది. ఉమెన్ డెలివరీ సెంటర్స్ విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలుగాను, సరైన వైద్య సదుపాయం లేక కడుపులోనే బిడ్డలు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై మీరు ఆలోచించి ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఉమెన్ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యం, రవాణా,నీటి సదుపాయం ఇప్పటికీ కూడా లేదు. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్యనే తల్లి మరణించారు సరైన వైద్యం మరియు రవాణా సదుపాయం లేక. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో యువతి యువకులు ఇంటర్ డిగ్రీ విద్యార్థులు కాలేజీలు వెళ్లి రావడానికి సరైన రవాణా సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరడం జరిగింది.