శ్రీ పవన్ కళ్యాణ్ ని రాజకీయాలకు అతీతంగా స్వాగతిద్దాం

ఉన్నత చదువుల కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఏప్రిల్ 6న జరగనున్న ‘స్ప్రింగ్ స్ప్రీ – 23’ కార్యకమానికి మన ప్రియతమ నేత, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిధిగా హాజరవుతున్న సందర్భాన ఆయనకు రాజకీయాలకు అతీతంగా స్వాగతం పలుకుదామని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి.మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. నిట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఒక వేడుకలా జరుగుతుంది. ఆ వేడుకకు మనం మరింత శోభ చేకూర్చుదాం. జన సైనికులు ఓ విషయం గుర్తుంచుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ‘స్ప్రింగ్ స్ప్రీ – 23’ రాజకీయేతర కార్యక్రమం. అందువల్ల ఎవరూ జనసేన పతాకాలను ప్రదర్శించ వద్దు. అదే విధంగా రాజకీయ నినాదాలు చేయవద్దు. మన ప్రియతమ నాయకుడు ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం అని మహేందర్ రెడ్డి కోరారు.