ఇక పై ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన

ఇక నుండి ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన. ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ) చట్టం-2021 ఏప్రిల్ 27 మంగళవారం నుండి అమలులోకి వస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారి చేసింది. దీంతో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకోవాలన్న లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనుమతి తప్పనిసరి. ఈ ఏడాది మార్చిలో పార్లమెంట్ లో ఈ సవరణ బిల్లు ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది.

‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజు’ అని బిల్లు ఆమోదం తెలిపిన సందర్భంగా కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. ఓట్లేసి ప్రజలెన్నుకునే ప్రభుత్వ అధికారాలను కాలరాయడం అంటే ప్రజలను అవమానించినట్లే అని ఆయన అన్నారు.