టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితం కాలం వ్యాలిడిటీ

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) సర్టిఫికెట్ విషయంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి టెట్ రాసి అర్హత సాధిస్తే.. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుందని ప్రకటించింది. కాగా, ఇప్పటివరకు టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ ఏడు సంవత్సరాలు ఉండేది. తాజా నిర్ణయం భవిష్యత్‌లో టెట్ రాసే వారికి మాత్రమే అమలు కానుంది. గతంలో పరీక్ష రాసి అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకుంటామని ఎన్‌సిటిఇ పేర్కొంది.

గత నెల 29న జరిగిన ఎన్సీటీఈ 50వ జనరల్ బాడీ మీటింగ్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించిన మినిట్స్​ను రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ మనదగ్గర మొత్తం ఆరుసార్లు టెట్ జరగ్గా.. అందులో నాలుగు సార్లు ఉమ్మడి ఏపీలో, రెండు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి.