జన్మభూమికి చేరిన శ్రీ రాముడు… ఘనంగా ప్రారంభిoచిన భూమి పూజ

దేశవ్యాప్తంగా  ఉన్న హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమయ్యింది. కొన్ని శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం ప్రారంభించడానికి పూజలు వైభవోపేతంగా మొదలయ్యాయి. ఈరోజు ఆలయ శంకుస్థాపన జరుగనుండగా శ్రీరాముని విగ్రహం . కొన్ని శతాబ్దాల తర్వాత జన్మభూమికి చేరుకుంది.

ఎన్నో వివాదాల నడుమ శతాబ్దాలుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగి రామ మందిర నిర్మాణానికి నేడు అయోధ్య లో భూమి పూజ జరగబోతుంది.  చరిత్రలో నిలిచిపోయేలా అత్యద్భుతమైన రామమందిరం ప్రజల కళ్ల ముందు సాక్షాత్కారం జరుగనుంది. దాదాపు దీనికి అవసరమైన ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. కరోనా ఆంక్షలు సైతం ప్రజల ఆకాంక్షను ఏమి చేయలేదనడానికి రామమందిర నిర్మాణాన్ని కనులారా వీక్షించడానికి అయోధ్య చేరుకున్న భక్తులు నిదర్శనమని చెప్పవచ్చు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని మోడీ రోజువారీ వస్త్రధారణకు కాస్త  భిన్నంగా ప్రధాని మోదీ హిందూ సాంప్రదాయ పంచకట్టులో అయోధ్యకి చేరుకున్నారు. ముందుగా హనుమాన్ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఈ రోజు మధ్యాహ్నం ముహూర్తం 12 గంటల 44 నిమిషాల 08 సెకన్లకు ప్రారంభమై 12 గంటల 44 నిమిషాల 40 సెక్షన్లకు పూర్తవుతుంది. ఆలయ నిర్మాణ భూమిపూజ ముహూర్త సమయం కేవలం 32 సెకండ్లు మాత్రమే ఉండగా  32 సెకండ్లలోనే మోదీ భూమిపూజ పూర్తి చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మొత్తం 175 మంది అతిథులు హాజరుకానున్నారు. వారిలో 135 మంది వివిధ సాంప్రదాయాలకు చెందిన సాధువులు ఉన్నారు. ముహూర్త సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను పునాదిరాయిగా స్థాపించనున్నారు.

దేశంలోని 2000 ఆలయాలు ప్రార్థనా స్థలాల నుంచి తెచ్చిన పవిత్ర మట్టి 100 నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాల్ని కార్యక్రమంలో ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై..మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది.