Araku: ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాదాల శ్రీరాములు

లోతేరు పంచాయితీ పరిధిలోని లిడ్డింగ్ గ్రామంలో పర్యటించిన జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు. ఈ పర్యటనలో భాగంగా లిడ్డింగ్ గ్రామాస్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ అనంతగిరి మండలం కొనపురం పంచాయితీ నుండి బొందుగుడా, సారాగుడా, లిడ్డింగ్ వరకు రోడ్డు సదుపాయం లేదు గ్రామస్తులు తీవ్ర ఇబ్బంధులు గురవుతున్నాం అని చెప్పారు. ఈ సందర్భముగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు రోడ్డు సదుపాయం వెంటనే కల్పించాలి సంవత్సరాల తరబడి హామీలతోనే కాలక్షేపం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల మా ఓట్లు వేయించుకుని మీకు పదవులు వస్తే మా గురించి మరిచిపోయి మా బ్రతుకులతో ఆడుకుంటారు. మీకు న్యాయమేనా అంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు.